హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఏప్రిల్ 1, 2017 న శ్రీ మీనాక్షి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ‘శ్రీ హేవిళంబి’ నామ 'ఉగాది' వేడుకలలో శ్రీ మల్లిక్ పుచ్చా గారు ‘భాగవతం ఆణిముత్యాలు’ యజ్ఞం గురించి చెప్పారు.
ఒక్క హ్యూస్టన్ నగరంలోనే కాక అమెరికాలో అన్నిచోట్లా, భారతదేశంలోనూ, తరువాత ప్రపంచంలో వీలైనన్ని దేశాలలో ఈ పోటీలు నిర్వహించటానికి మన తెలుగువారు అందరూ సహకరించగలరని ఆశిస్తున్నారు.
పిల్లలకు “శ్రీమద్భాగవతం” ప్రాముఖ్యత దానిలోని పద్యాల ద్వారా తెలియచెప్పాలని iBAM సంస్థ ఈ "మహాయజ్ఞాన్ని" తలపెట్టిందని చెప్పారు.
భాగవతం లోని 7 వేల పైచిలుకు పద్యాలలో నుండి 324 పద్యాలను 5 లక్షణాల ద్వారా (ఆధ్యాత్మిక సౌరభాలు, నీతిమార్గము, ఋజుమార్గము, భక్తితత్త్వము మరియు భగవత్ లీలలు) ఎంపిక చేసుకుని వాటికి ‘భాగవతం ఆణిముత్యాలు’ అనే పేరుపెట్టి, విశేష కృషి చేసి iPhones కి, Android phones కి, iPads కి వీలైన App ని తయారుచేయించి, iBAM 2.2 పేరుతో ఎనిమిది సంవత్సరాలనుండి అందరికీ ఊరికే అందేలా చేస్తోంది iBAM సంస్థ.
ఇక, 'భాగవతం ఆణిముత్యాలు' పద్యాల పోటీ విషయానికి వస్తే -
The iBAM Organization conducted its first Competition in Houston in consort with the other organizations - a three-organizational collaboration project i.e. iBAM, TCA-TeluguBadi and Houston Telugu Cultural Association.
Why we are conducting the competition:
By providing an opportunity to learn iBAM Padyaalu in their native language with the help of their parents, the youngsters from age 2 on wards will be able to learn our language and learn to recite them with enthusiasm.
Once they develop the interest in the Padyaalu, with the additional help of the mobile devices and laptops, they will learn the context and the meaning of the ‘Padyam’ (పద్యం) to inculcate ‘Bhakti’ (భక్తి) towards God, ‘Neetulu’ (నీతులు) towards the righteous ways of life in addition to developing appreciation for ‘Bhagavat Leelalu’ (భగవత్ లీలలు) and ‘Karyaalu’ (కార్యాలు) to establish good over evil. These competitions with awards will drive their additional interest and motivation to learn Telugu literature/తెలుగు సాహిత్యం.
This understanding during their formative years will help them grow as useful citizens of the world with intellectual, spiritual, and righteous ways of life.
iBAM సంస్థ, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి, ఈ సమితి లోని ఒక భాగమైన "తెలుగుబడి" - ఈ మూడు కలిసి టెక్సాస్ లోని 18ఏళ్ళ లోపు, (Optional 19-25 years) తెలుగు బాలబాలికల మధ్య ఈ పోటీ నిర్వహించాలని తలపెట్టాయి.
తెలుగు సాంస్కృతిక సమితి సహకారంతో ‘తెలుగుబడి’ నిర్వాహక బృందానికి ఈ పోటీలు నిర్వహించే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించింది iBAM సంస్థ.
ఆ తెలుగుబడి బృందం లో కొందరు - వనజ కొండూరి, అరుణ గుబ్బా, రఘురామ్ ధూళిపాళ, ఇందిర చెరువు, అన్నపూర్ణ పుల్లూరి, సుష్మ మద్దినేని, వినోద్ ఉడ్తావర్, మురళి లంక, స్వర్ణ లంక.
ఈ బృందం అంతా ఆశించినట్టుగానే డిసెంబర్ 9, 2017 న "భాగవతం ఆణిముత్యాలు" పద్యాలలో మొట్టమొదటి పోటీ శ్రీ అష్టలక్ష్మీ దేవాలయ కళామందిరంలో నిర్విఘ్నంగా, ఎంతో అద్భుతంగా ముగిసింది.
బాలబాలికలు అందరూ ఎంతో మంచి గాత్ర శైలితో, ధారణాశక్తి తో పద్యాలు వినిపించి న్యాయనిర్ణేతలను, నిర్వాహకులను, విచ్చేసిన అందరినీ మంత్రముగ్ధులను చేశారు.
ఇదే ప్రోత్సాహం తో ఈ బృందం మరల సెప్టెంబర్ 22, 2018 న, "భాగవతం ఆణిముత్యాలు" లో రెండవ సారి పోటీ నిర్వహించ నిర్ణయించుకుంది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ పోటీ రద్దుచేయబడినది.
ఈ సంస్థ స్థాపకులైన శ్రీ పుచ్చా మల్లిక్ గారు ప్రతి సంవత్సరమూ భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వచ్చే వామన జయంతి సందర్భంగా, ఆ రోజుకు దగ్గరలో ఈ పోటీ నిర్వహించాలని నిశ్చయించారు. అందుకని, 2019 సెప్టెంబర్ 14 వ తారీఖున మరల ఎంతో దీక్షతో ప్రణాళికలు వేసి, అకుంఠిత భావంతో ఈ సంస్థలో భాగంగా పనిచేస్తున్న మరొక బృందం సెప్టెంబర్ 14, 2019 న ఈ పోటీ నిర్వహించి ఘన విజయం సాధించింది.
ఈ సంస్థ స్థాపకులైన శ్రీ పుచ్చా మల్లిక్ గారు ప్రతి సంవత్సరమూ భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వచ్చే వామన జయంతి సందర్భంగా, ఆ రోజుకు దగ్గరలో ఈ పోటీ నిర్వహించాలని నిశ్చయించారు. అందుకని, 2019 సెప్టెంబర్ 14 వ తారీఖున మరల ఎంతో దీక్షతో ప్రణాళికలు వేసి, అకుంఠిత భావంతో ఈ సంస్థలో భాగంగా పనిచేస్తున్న మరొక బృందం సెప్టెంబర్ 14, 2019 న ఈ పోటీ నిర్వహించి ఘన విజయం సాధించింది.
iBAM 2.2 App ని download చేసుకుని అందరూ ఆ 324 పద్యాలు వినాలని, పిల్లలకు వినిపిస్తూ వారికి నేర్పాలని iBAM సంస్థ వారి కోరిక. తల్లిదండ్రుల సహాయంతో రోజూ పిల్లలు ఆ పద్యాలు వింటూవింటూ సాధన చేస్తూ ఉంటే వారికి నేర్చుకోవాలనే కోరిక బాగా పెరుగుతుందని చెప్పారు ఈ సంస్థ వారు.
Download iBAM 2.2 App in iphones, Androids and iPads for free.